శివాజీ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మణ్ రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి విద్యాలయంలో భగవద్గీత బోధన తప్పనిసరి చేయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏం. లక్ష్మణ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ లోగల ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం భగవద్గీత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ రావు హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంటింటా గీత పఠనం అలవర్చుకోవాలని కోరారు. గీత సారం ఆకళింపు చేసుకుంటే, జీవితంలో బాధలే ఉండవన్నారు. సనాతన ధర్మ రక్షణకు, ఇంటింటా గీత బోధన జరగాలని ఆకాంక్షించారు. ఆదిత్య పాఠశాల విద్యార్థుల గీత జిజ్ఞాసను చూసి, ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ భారతీయ పౌరులుగా ఎదగాలని మార్గ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆదిత్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. గీత శ్లోకాల పఠనంతో విలువలు జీవన పెరుగుతాయన్నారు. విలువలతో కూడిన విద్య అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

