పాఠశాలల్లో గీత బోధన చేయాలి
శివాజీ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మణ్ రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి విద్యాలయంలో భగవద్గీత బోధన తప్పనిసరి చేయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏం. లక్ష్మణ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ లోగల ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం భగవద్గీత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ రావు హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు....