27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

Must read

📰 Generate e-Paper Clip

 

.. . ఇంటర్మీడియట్ లో 66.20 శాతం ఉత్తీర్ణత

.. . మొదటి స్థానంలో మెడ్చల్.. చివరకు రాజన్న సిరిసిల్ల

హైదరాబాద్, బతుకమ్మ:

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవ రావు 202526 విద్యా సంవత్సరానికిసంబంధించి  ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్ ను విడుదల చేయగా 66.20 శాతంమంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 3,23,807 (66.20) మందివిద్యార్థులు, సెకండ్ ఇయర్ లో 3,58,490 (70 శాతం) విద్యార్థులు పాసయ్యారు.తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా దాదాపు నాలుగు లక్షల మందివిద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ ఎడాది ఇంటర్ ఫలితాలు 74.4 శాతం ఉత్తీర్ణత తోబాలికలు పై చేయి గా నిలిచారు. బాలురు 57.69 శాతం ఉత్తిర్ణులు అయ్యారు. ఇంటర్ఫలితాలలో మెడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, రాజన్న సిరిసిల్ల జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లేదా వాట్సప్ లో డౌన్లోడ్చేసుకునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. పరీక్షల్లో పాస్ కాని విద్యార్థులు తొందరపాటులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు అధికారులు కోరుతున్నారు.విద్యార్థుల లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మానసిక స్థైర్యం నింపి వారిలోఆత్మవిశ్వాసం పెంచాలని కోరుతున్నారు. ఇంటర్మిడియట్ ఫలితాల రీవాల్యుయేషన్,అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వివరాలు ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డుఅధికారులు.

 

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ లో 66.19 ఉత్తీర్ణత

.. బాలికలదే పై చేయి

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19 ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64 ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823మంది బాలికలు ఉత్తీర్ణత కాగా  76.56 శాతం తో బాలుర పై చేయి సాధించారు.రెండవ సంవత్సరం బాలురు  6,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో3,364మంది విద్యార్థులు పాసై 53.63 శాతం ఉత్తిర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8.806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64 శాతం సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది  పరీక్షలకు హాజరుకాగా వీరిలో 5,868 మంది బాలికలు ఉత్తీర్ణులై 67.36 పాస్ సాధించారు. అలాగే  మొదటి సంవత్సరం జనరల్ బాలురు 6,836 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 2,938 మంది ఉత్తీర్ణులై 42.98 పాస్ అయ్యారు.

More articles

Latest article