. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారి హరినేత్ర పై వీధి కుక్కలు శుక్రవారం దాడి చేశాయి. కిరాణా షాపు లో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారి పై కుక్క దాడి చేసింది. చిన్నారి చెంప, పెదవి పై గాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ పట్టణంలో ఓ చిన్నారిపై కుక్క దాడి ఘటన మరువకముందే జిల్లా కేంద్రంలో మరో చిన్నారిపై కుక్కదాడి చేయడం కలకలం రేపింది.
