నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని నిజామాబాద్ జీజీహెచ్ ఇన్ చార్జి సూపరింటేండేంట్ ప్రొ.డా.నాగమోహన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సలహాదారు స్వగృహంలో వారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో వైద్య సేవల మెరుగుదలపై చర్చించగా, దీనికి సలహాదారు సుధర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని డా.నాగ మోహన్ తెలిపారు.
