27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మత్తు పదార్థాలు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

బియ్యం దందా చేద్దామని నమ్మించి ఓ వ్యక్తి ని దావత్ చేసుకుందామని బీర్ లో మత్తు గోళీలు కలిపి నగలు దోచుకున్న ముఠా అట కట్టించారు పోలీసులు… నిజామాబాద్ నగరం లోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ కుమార్, ఎస్. ఐ ఉదయ్ కుమార్, ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….. నాల్గవ టౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గత ఏడాది 17 డిసెంబర్ ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు పరిశోధన ప్రారంభించారు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన బాతం ప్రసాద్, హైదరాబాద్ కు చెందిన నర్సింగ్,రుద్ర యాదవ్ లు నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ లకు రోడ్ పైన టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది.. రైస్ వ్యాపారం గురించి మాయ మాటలు చెప్పి లింక్ కలిపారు.. తాము ఆంధ్ర నుంచి బియ్యం సరఫరా చేస్తామని స్థానికంగా డీలర్ షిప్ తీసుకోవాలని నమ్మించారు… ఈ సందర్భంగా దావత్ చేసుకుందామని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో తాగే బీరులో మత్తు గోళీలు కలిపి తాగిపించారు.. శ్రీనివాస్ స్పృహ తప్పడంతో అతని వద్ద నుండి రెండు బంగారు ఉంగరాలు,గోల్డ్ చైన్ కొంత నగదు దొంగిలించకపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేసి బాత ప్రసాదం, నర్సింగారావు, రుద్రా యాదవ్ ను పట్టుకొని విచారించగా వారు ఇట్టి కేసులో నేరం ఒప్పుకున్నందున వారి నుండి కొంత నగదును వారి యొక్క సెల్ ఫోన్లను స్వాదినపరచుకోన్నారు. తాము దొంగిలించినటువంటి సొమ్మును హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ గుప్తా వద్ద తాకట్టు పెట్టినారని కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో కూడా నేరస్తులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లలో పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కావున ప్రజలందరికీ తెలియజేయడం అనేది ఏమనగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి నమ్మించి వారు ఇచ్చేటువంటి డ్రింకులను తాగకుండా, తమ యొక్క సొమ్ము పోగొట్టుకోకుండా ఉండాలని ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా పని చేసిన ఏఎస్ఐ రవీందర్, పోలీస్ కానిస్టేబుల్లు , శేకర్, రమేష్, నగేష్, సిబ్బందిని అబినందించారు.

More articles

Latest article