28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని గణేష్ నిమజ్జనాలు  ఎటువంటి అపశృతి జరగకుండా నిర్వహించాలని మండల ప్రజలకు సూచనలు లతెలిపారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపు సమయంలో డీజే వ్యవస్థ సౌండ్ సిస్టలను వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఎస్ఐ రాజశేఖర్  తెలిపారు. డీజే వలన వచ్చే అధిక శబ్దం వలన వృద్దులు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని గౌరవ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం డీజే సౌండ్ సిస్టమ్ పై నిషేధం విధించబడింది. నిర్వాహకులపై, డీజే ఓనర్, ఆపరేటర్ ల పై కేసు నమోదు అవుతుంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మండల వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు గ్రామ చెరువులు కుంటలో నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని గణేష్ మండప నిర్వాహకులకు తెలిపారు . ఈ సందర్భంగా పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన శోభాయాత్రల సమయంలో శాంతి భద్రతల కోసం పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు.  గణేష్ ఉత్సవాలను భక్తి భావంతో, సాంప్రదాయబద్ధంగా మరియు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసుల సూచనలకు సహకరించాలని మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ కోరారు.

More articles

Latest article