25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రైస్ మిల్లులో పేకాట

Must read

📰 Generate e-Paper Clip

  • పిట్లంలో ఎల్లారెడ్డి పోలీసుల దాడి

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బాలాజీ రైస్ మిల్లులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడి చేయగా, తొమ్మిది మంది పట్టుబడ్డారు. స్థానిక పోలీసుల సహకారంతో పిట్లంలో పేకాట జోరుగాసాగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్పీ సింధుశర్మ.. ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో దాడులకు ఆదేశించారు. రైస్ మిల్లుపై దాడి చేసిన ఎల్లారెడ్డి పోలీసులు మాజీ ఎంపీపీ భర్త, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, రిటైర్డ్ ఆర్టీవోతోపాటు పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల 4వేల నగదుతోపాటు 9 సెల్ ఫోన్లు, 5కార్లను స్వాధీనం చేసుకున్నారు.

More articles

Latest article