25.8 C
Hyderabad

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బిగాల మద్దతు

Former MLA Bigala extends support to the indefinite strike by NHM employees

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు ప్రకటించారు.  ఆదివారం ధర్నాచౌక్ లో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో బిగాల కూర్చోని వారి సమస్యల పరిష్కారానికి మద్దతు తెలిపారు.  ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు.  ఎన్ హెచ్ఎం ఉద్యోగులకు  గౌరవప్రదమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్టేట్ హెల్త్ సొసైటీ  ద్వారా స్పార్ష్  విధానంలో వేతనాలు చెల్లించాలని,  2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5% ఇంక్రిమెంట్, 8% వార్షిక వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సెలవుల సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, ఈహెచ్ఎస్, ఈఎస్ఐ  వైద్య సదుపాయాలు అందించాలని, గర్భిణీ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఇతర అర్హత కలిగిన సిబ్బందికి తగిన సెలవుల సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్ సీ, ఏరియర్స్ బకాయిలను చెల్లించాలని,  జీవో నంబర్ 60, 1195 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులకు వేతన సవరణ ప్రయోజనాలు కల్పించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్ హెచ్ఎం ఉద్యోగుల కృషి ఎంతో కీలకమని, వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని గణేష్ బిగాల పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article