ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండలానికి చెందిన ఎస్సై మనోజ్ కుమార్ బదిలీపై నిజామాబాద్ కు వెళ్లడంతో శుక్రవారం నూతన ఎస్సైగా నిజాంబాద్ వి ఆర్ లో విధులు నిర్వహిస్తున్న జి.సందీప్ చార్జి తీసుకున్నారు. అనంతరం ఎస్సై సందీప్ మాట్లాడుతూ మండల ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలన్నారు. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. తప్పు చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
