28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహన్ అంత్యక్రియలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సిఐటియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం నాయకురాలు నూర్జహన్ శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం ఆమె స్వగ్రామమైన బాన్సువాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె సోదరుడు, మున్సిపల్ కౌన్సిలర్ ఖలీల్ స్వగృహం వద్ద పార్థివ దేహాన్ని చివరి చూపు నిమిత్తం ప్రజలు, అభిమానుల కోసం ఉంచారు. స్థానిక సంగమేశ్వర కాలనీలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈద్గాకు తరలించారు. అక్కడ జనజ నమాజు చదివిన అనంతరం కబ్రిస్తాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా నాయకులు, సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల నుంచి సిఐటియు, సిపిఎం, టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా నలుమూలల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

More articles

Latest article