నిజామాబాద్, బతుకమ్మ : గుడిసె వాసుల కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మల్యాల గోవర్ధన్ కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ఆధ్వర్యంలో మల్యాల గోవర్ధన్ శాలువాతో సోమవారం సన్మానించి జ్ఞాపికను అందజేశారు, అభయ హస్తం కాలనీ అభివృద్ధి కోసం మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, కరెంటు సౌకర్యం కోసం అభివృద్ధి నిధులు సరిపోనందున, మరిన్ని నిధులను మంజూరు చేసి కరెంటు, డ్రైనేజీ, రోడ్లు నిర్మాణానికి కృషి చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు, మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కృషి చేయాలని కోరారు,