. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఎల్లారెడ్డి, బతుకమ్మ:
వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసింది. గత వర్షాకాలం పురాతన పోచారం ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి గండిపడే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ మరమ్మత్తు కోసం చేసిన ప్రతిపాదనలు చెత్త బుట్టల పాలైన విషయం తెలిసిందే. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ఫలితంగా పోచారం ప్రాజెక్టులో శాశ్వత మరమ్మతుల కోసం మొత్తం రూ. 3.58 అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో వరదల కారణంగా దెబ్బతిన్న రైట్ ఫ్లాంక్ కోర్ వాల్, అబట్‌మెంట్, డౌన్‌స్ట్రీమ్ వింగ్ వాల్, రిటర్న్ వాల్స్ శాశ్వత మరమ్మతులకు రూ.1.24 మంజూరు చేస్తూ ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖ నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.అదే విధంగా ఎడమ ఫ్లాంక్ వీర్ , మధ్య వీర్ , కుడి ఫ్లాంక్ వీర్ శాశ్వత మరమ్మతులు, సెక్షన్ అభివృద్ధి, ఆర్.ఎఫ్. బ్రిడ్జి మరమ్మతులు, ఎర్తెన్ బండ్ టో డ్రైన్స్ పునరుద్ధరణ తదితర పనులకు రూ. 2.34 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 10న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఈ రెండు జీవోల ద్వారా పోచారం ప్రాజెక్టు భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరదల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అలాగే ఆయకట్టు రైతులకు సాగునీటి సరఫరా మరింత సురక్షితంగా, సమర్థవంతంగా అందే అవకాశం ఏర్పడనుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలు నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోచారం ప్రాజెక్టు బలోపేతానికి అవసరమైన నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిధుల మంజూరుతో పోచారం ప్రాజెక్టు పరిధిలోని రైతులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

