నల్గొండ, బతుకమ్మ: స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు(96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో మృతి చెందారు. నారాయణరావు మృతి పట్ల సీపీఐ సీనియర్ నేత నారాయణ సంతాపం ప్రకటించారు. సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా నారాయణరావు పని చేశారు. 1940వ దశకంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా నారాయణరావు పోరాడారు.
