రుద్రూర్, బతుకమ్మ: అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 జూన్ సందర్భంగా ఆదివారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని యోగ భవనంలో ఉచిత యోగ, ధ్యాన శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పతంజలి యోగ సోషల్ మీడియా అధ్యక్షులు డాక్టర్ విశ్వనాధ్ మహాజన్, యోగ సమితి అధ్యక్షులు కెవి మోహన్, బాలరాజు, పురుషోత్తం, పుట్టి ప్రకాష్ , జ్యోతిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు ఏడు రోజుల ఉచిత యోగ, ధ్యాన శిబిరాన్ని ప్రతిరోజు ఉదయం 5.15 నుండి 6.30 వరకు నిర్వహిస్తారన్నారు. ఈ ఏడు రోజుల శిక్షణ కార్యక్రమంలో యోగ ధ్యానం దైనందిన జీవితంలో ఎదురయ్యే రోగాలను ఏ విధంగా తొలగించుకోవచ్చునో యోగ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.
