24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: స్వస్త్ నారీ సశక్స్ పరివార్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ అయోషాసిద్దిఖా ఆధ్వర్యంలో  సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 9 మంది వైద్య నిపుణులచే ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించారు. ఈ శిబిరంలో దంత పరీక్షలు, కంటి పరీక్షలు, చర్మ వ్యాధులు, బీపి, షుగర్, రక్త పరీక్షలు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య  విస్తీర్ణాధికారి శ్రీనివాస్, ఆరోగ్య పర్యావేక్షకులు రవి, సుమతి, ఫార్మసిస్ట్ స్వప్న, ఆరోగ్య కార్యకర్తలు అనిత, గౌరి, శిరీష, రమాదేవి, నర్సింగ్ ఆఫీసర్ వరలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ తరుణ్,  ఆశాకార్యకర్తలు లత, నిర్మల, భూలక్ష్మి, ప్రేమల, ఇందిర, రంజన, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Free mega medical camp at primary health center

More articles

Latest article