27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

21న ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  తెలంగాణ ఆల్  పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ నెల21 నిజామాబాద్ నామ్దేవ్వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ లో ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక ఫైబ్రో స్కాన్ ద్వారా లివర్ కు సంబంధించిన ఆరోగ్యాన్ని  కచ్చితంగా అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. దాదాపుగా రూ.6వేల విలువగల ఈ టెస్టును రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల , వారి కుటుంబ సభ్యులకు కోసం నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె రామ్ మోహన్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని,టెస్టు అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్టర్లు రిపోర్టుల  ఆధారంగా మందులు రాయటం, సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ జయని నెహ్రూ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు  డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి  తదితరులు క్యాంపులో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ మదన్మోహన్,  జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, ప్రసాద్ రావు, నరేందర్, చంద్రశేఖర్, రాధా కిష,న్ పూర్ణచంద్ర రావు, సిర్ప లింగయ్య  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article