27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో చెరువు కట్ట వద్ద పనిచేస్తున్న వందరోజుల కూలీలకు మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ లయన్ మచ్కూరి రమేష్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 116 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి చుక్కల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇందులో చికిత్స చేయించుకున్న 12 మంది రోగులకు కంటి ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారికి రెఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కెవి. మోహన్ మాట్లాడుతూ.. ఉదయం నుంచి ఎండలో పనిచేస్తున్న కూలీలకు వైద్య సేవలు అందించడం ఎంతో గర్వకారణం అని ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మచ్కూరి రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా లయన్స్ కంటి ఆసుపత్రి వారు ఎక్కడ అవసరం ఉన్న వెంటనే వారి సిబ్బందిని, హాస్పిటల్ బస్సుని పంపించి వైద్య సేవలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని లయన్స్ కంటి ఆసుపత్రి ఫౌండర్, మాజీ గవర్నర్ లయన్ బసవేశ్వర రావు, ట్రస్ట్ సభ్యులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, సభ్యులు లయన్ పార్వతీ ప్రశాంత్, ఆసుపత్రి సిబ్బంది హన్మంత్ రావు, రఫీ, వైద్యులు కె.అజయ్, గ్రామ వార్డు సభ్యులు బేగరి గోపి, మంజుల, సావిత్రి, జెల్ల సాయిలు, గ్రామస్తులు నక్క గంగారాం, హన్మంతు, పోశెట్టి, లస్మయ్య, గజేందర్, విట్టల్, సునీత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article