27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉచిత కంటి వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తాహాసిల్దార్ కార్యాలయంలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడివిజన్ ఐ కేర్ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.  విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, మేడివిజన్ ఐ కేర్ సెంటర్ డాక్టర్ దీప్ సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, యూనియన్ ప్రతినిధులు వెంకటేశం, సత్యనారాయణ, ఇస్మాయిల్, బాబురావు, సాయిలు, వీర గౌడ్, నగేష్ ,రాజాబాయ్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.

Free Eye Camp

More articles

Latest article