23.2 C
Hyderabad

108లో గర్భిణీ ప్రసవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవించిన ఘటన భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ ఎన్ హెచ్ 44 హైవేపై మంగళవారం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం జగదాంబ తండా కు చెందిన జి పూర్ణ అనే గర్భిణీ మూడో కాన్పు కోసం కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి వెళ్ళింది అక్కడ వైద్యులు పరీక్షించి బిడ్డ అడ్డం తిరిగిందని లోపల బిడ్డ బరువు తక్కువగా ఉందని తొందరగా హైదరాబాద్ వెళ్లాలని గర్భిణి బంధువులకు తెలియజేశారు. వెంటనే వారు 108 కు ఫోన్ చేయగా గాంధారి నుంచి అంబులెన్స్ వచ్చి గర్భిణీ స్త్రీని అంబులెన్స్ ద్వారా నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకు వెళ్తుండగా బస్వాపూర్ హైవే దగ్గర పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది రోడ్డు పక్కన ఆపుకొని ప్రసవం చేశారు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డను క్షేమంగా నీలోఫర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కష్టకాలంలో ఆదుకున్నటువంటి అంబులెన్స్ ఈఎంటి రమేష్ పైలట్ నరేష్ ను బంధువులు అభినందించారు.

More articles

Latest article