నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఈ నెల 22న ధర్పల్లి మండలం దుబ్బాక అటవి ప్రాంతంలో యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నలుగురిని పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు తెలిసింది. ధర్పల్లి మండలం డీబీ తాండకు చెందిన గుగులోత్ సురేష్, గుగులోత్ రమేష్, భూక్య మహేశ్వర్, కేలోత్ సీతారాములను అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నలుగురికి రిమాండ్ విధించినట్లు తెలిసింది. ఇద్దరు యువతులపై అత్యాచారం ఘటనలో ఒక యువతి మైనర్ అని సమాచారం. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. యువతిపై అత్యాచారం జరిగిన సమయంలో స్పృహలో లేకపోవడంతో మద్యం తాగించారా? లేక డ్రగ్స్ వాడారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
