సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ మండల అమర్లబండ గ్రామంలో రూ. 2.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అమర్లబండ–ధర్మరాయపేట హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. “గడప గడపకు మదన్ అన్న” కార్యక్రమంలో, అలాగే గత వర్షాకాలంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు చేసిన వంతెన నిర్మాణ అభ్యర్థనను గౌరవిస్తూ, ఆ సమయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతున్నాను అన్నారు. గ్రామస్థులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కు కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
