స్పెషల్ ఆఫీసర్ కుర్చీ కబ్జా చేసిన మాజీ సర్పంచ్

0 1,136

గాంది జయంతి సంధర్బంగా కులాస్ పూర్ తాండా మాజీ సర్పంచ్ నిర్వాకం

 మోపాల్,  బతుకమ్మ:                                                                                                                                                           

సర్పంచ్ ల పధవి కాలం ముగిసింది… ప్రస్తుతం నడుస్తున్నది స్పెషల్ ఆఫీసర్ ల పాలన. కాని ఓక గ్రామ మాజీ మాత్రం తానే తాజా మాజీ అని  గాంధి జయంతి సంధర్బంగా పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫిసర్ కుర్చిలో కుర్చుని అంతా తానై వ్యవహరించాడు… మోపాల్ మండలం  కులాస్ పూర్ తండాలో గ్రామ పంచాయతీ లో గాంధీ జయంతి నిర్వహించారు. కాగ పదవి లేకున్నా తాజా మాజీ సర్పంచ్ స్పెషల్ ఆపిసర్ కుర్చిలో కూర్చోవడం చర్చకు దారి తీసింది. చిన్న పూర్ గ్రామం గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న కులాస్ పూర్ తాండా కు ఇన్చార్జి గా ఉన్నారు. బుదవారం గాందీ జయంతి కార్యక్రమం చిన్నాపూర్ లో పూర్తి చేసుకొని వచ్చే సరికి  కులాస్ పూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది గాంధీ జయంతికి ఏర్పాటు చేయాలని అదేశించారు. గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి అనంతరం  గ్రామంలో వీధి ద్వీపాల సమస్య గురించి మాట్లాడడం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. స్పెషల్ ఆఫీసర్ కుర్చీలో మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్ కూర్చున్నారు.తాను వచ్చిన తరువాత స్పెషల్ ఆఫిసర్ కుర్చిలోనుంచి లేవాలని మాజీ సర్పంచ్ కు చెప్పిన వినిపించుకోలేదని, విద్యుత్ ద్వీపాల గురించి మాత్రమే మాట్లాడటం జరిగిందని, ఎంత చెప్పినా వినలేదని ఇంచార్జీ కార్యదర్శి స్వప్న వాపోయారు. కులాస్ పూర్ తాండా లో జరిగిన విషయంపై ఎంపిడిఓను వివరణ కోరితే పోరపాటు జరిగిందని రాయవద్ధని కోరడం విశేషం. తాజా మాజీ సర్పంచ్ అధికారం లేకున్న ప్రజా ప్రతినిధి అండాతో అధికారం చెలాయిస్తున్నాడని అందరు అంటున్నారు.

 

Former sarpanch who occupied the chair of special officer..

Leave A Reply

Your email address will not be published.