25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించిన మాజీ సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండి పొంగి పొర్లుతున్నాయి. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని పలు కాలనీల్లో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, సెక్రెటరీ మహమ్మద్ రఫీలు సందర్శించారు. గ్రామంలో శిథి లావస్థకు చేరిన ఇళ్లను, మురికి కాలువలను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్మికులతో మురికి కాలువలను, నిల్వ ఉన్న వర్షపు నీటిని శుభ్రం చేయించారు. వర్షానికి కూలిన ఇల్లు ఉంటే వారికి తెలుగు మీడియం స్కూల్,  ఉర్దూ మీడియం స్కూల్, అంగన్వాడి కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు.

More articles

Latest article