29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎంపీటీసీ సుజాత మిస్సింగ్

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కారం సుజాత ఈనెల 15న ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఇంట్లో భర్త కారం నవీన్ తో చిన్నపాటి గొడవ కావడంతో మనస్థాపానికి గురై ఇంటి నుంచి ఉదయం ఐదు గంటల సమయంలో వెళ్లిపోయినట్టు తెలిపారు. కారం సుజాత ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు గులాబీ రంగు స్వెటర్  ధరించినట్టు తెలిపారు.  భర్త నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు మాక్లూర్ స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వవలసిందిగా స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

More articles

Latest article