23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

పిప్రి మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ లో చేరిక

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి గ్రామ మాజీ ఎంపిటిసి అరిగెల స్వామి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్నారై గుండ సాయిలు, ఓల్లం రమేష్, పల్లె శ్రీను, నీలం మను, పడాల ప్రణీత్, పుప్పాల రాము, రౌతు చిన్న నర్సయ్య, అరిగెల ధర్మపురి, రౌతు రాము, న్యాలకంటి ప్రేమ్, కొడిగెల నర్సయ్య, రాజుల అనిల్, జంగం గంగారం, ముత్యాల రాజరెడ్డి, తెనుగు సతీష్ లు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలొ చేరారు. వారందరికి సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కుంట రమేష్, పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article