27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసులకు లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జూబ్లిహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో రాహెల్ నిందితుడు

. . . కోర్టు ఆదేశాలతో లోంగుబాటు

 హైదరాబాద్, బతుకమ్మ:

బోధన్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తనయుడు రాహెల్ జూబ్లిహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022  మార్చి 17న  హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు రాహెల్ నిందితుడు.  అనాడు థార్ కారు నడిపి ఓకరి మరణానికి కారకుడైన రాహెల్  పరారీలో ఉండి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు రాహెల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కేసు నమోదు సమయంలో షకీల్ ఎమ్మెల్యే గా ఉండగా అధికార పార్టీ ద్వారా  ఒత్తిళ్లు తెచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో రాహెల్ ను తప్పించే ప్రయత్నంలో ఒ సిఐ కుడా సస్పెన్షన్ కు గురయ్యారు. చనిపోయిన కుటుంబానికి చెందిన వారు మహరాష్ట్రవాసులు కావడంతో ప్రలోొబాలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటివల కోర్టులో రాహెల్ తన బేయిల్ విషయంలో కోర్టును ఆశ్రయించగా పోలీసులకు లొంగిపోవాలని సూచనతో సరెండర్ అయినట్టు సమాచారం.

More articles

Latest article