26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బిజేపికి రాం రాం చెప్పిన మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బిజెపికి రాజీనామా

 జుక్కల్, బతుకమ్మ :

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం బిజెపికి రాజీనామా చేశారు. శనివారం పెద్ద కొడప్ గల్ లోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో తాను బిజేపికి రాం రాం చెప్పినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ అని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. తనకు రాజకీయంగా  కలిసి వచ్చిన పార్టిని బిజేపి లో ఉండి వ్యతిరేకంగా మాట్లాడలేక రాజీనామా చేస్తున్నట్లు  వెల్లడించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగారం అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిక పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదివరకే గంగారం రాజకీయ వారసుడు అరవింద్ ను ఇది వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. జుక్కల్ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు, గంగారం కు మధ్య సఖ్యత లేదు.

More articles

Latest article