24.6 C
Hyderabad

ఎమ్మెల్యే వేములను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుక్రవారం కలిశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించదానికి పత్రికలు, టీవీ చానళ్ళు, న్యాయస్థానాలు ఉన్నాయి కానీ దాడులు సమంజసం కాదని అన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతికి తెరలేపొద్దని అన్నారు. నిజామాబాద్ లో రాజకీయంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది దానిని దాడులతో విబేధాలు సృష్టించవద్దని తెలిపారు.  ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article