ఎన్ హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బిగాల మద్దతు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు ప్రకటించారు. ఆదివారం ధర్నాచౌక్ లో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో బిగాల కూర్చోని వారి సమస్యల పరిష్కారానికి మద్దతు తెలిపారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో సమస్యలు...