బీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు భాదిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమం లో భాగంగా భీమ్ గల్ తాజా, మాజీ జడ్పిటీసీ చౌట్ పల్లి రవికి ఇటీవలే యాక్సిడెంట్ కాగా ఆయన నివాసం బాబాపూర్ వెళ్లి పరామర్శించారు. తాజా మాజీ ఎం పీ పీ ఆర్మూర్ మహేశ్ కు కంటి ఆపరేషన్ కాగా చెంగల్లో ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే చెంగల్ కు చెందిన మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు.బీయర్ ఎస్ నాయకుడు పరమేశ్వర్ కు చేతికి ఫ్రాక్చర్ కాగా ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మండలంలోని బెజ్జోరా, ముచ్చుకోర్ గ్రామలో పలు భాధిత కుటుంబలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఇందులో భాగంగా బెజ్జోరా గ్రామ తాజా మాజీ సర్పంచ్ కోగురు సుమన్ భార్య తాజా మాజీ సర్పంచ్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. బెజ్జోరా బీయర్ ఎస్ యువ నాయకుడు కార్తిక్ తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ హార్ట్ స్ట్రాక్ తో మరణించగా వారి కుటుంబాన్ని కుటుంబాన్ని పరామర్శించారు. ముచ్కూర్ గ్రామానికి చెందిన బీయర్ ఎస్ కర్రోళ్ల రాకేష్ అతి చిన్న వయసులో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
