కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన నాయకులు
. . . మెడికల్ కళాశాల నిర్మాణ ప్రధాతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ , మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి తో కలిసి నగరంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో నిర్వహించారు. శనివారం మెడికల్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రామర్తి గోపి , వేణు రాజులు మాట్లాడుతూ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత అని గతంలో ఆయన మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ,జిల్లా అభివృద్ధి కొరకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ,ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే శాఖల్లో పలు రకాల విప్లవాత్మక మార్పులు , అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించారని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించిన ఘనత కూడా సుదర్శన్ రెడ్డికే దక్కుతుందని ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ ఉచితంగా వైద్య విద్యను అభ్యసిస్తున్నారంటే అది కేవలం సుదర్శన్ రెడ్డి కృషి ఫలితం అని వారు అన్నారు. భవిష్యత్తులో సుదర్శన్ రెడ్డి అత్యంత కీలకమైన శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇప్పుడు రాష్ట్రానికి ,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరింత సేవ చేస్తారని ఆకాంక్షిస్తూ ఎన్.ఎస్.యు.ఐ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ..వైద్య కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తో పాటు వివిధ విభాగాల ప్రొఫెసర్లు మెడికల్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ యుఐ నాయకులు సాయికిరణ్ , శివ, హరీష్ , వినోద్. కౌశిక్, కనకరాజు, బన్నీ, కిషోర్ పాల్గొన్నారు.

