కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
బతుకమ్మ, మాచారెడ్డి: మండల లోని సోమార్ పేట గ్రామానికి చెందిన కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోత్ రమేష్ అనారోగ్యంతో అకాల మరణం పొందారు . విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హుటాహుటిన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు . అతని మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, రైతు బంధు మాజీ కన్వీనర్ భుక్యా నర్సింలు, మండల బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజాగౌడ్, మండల మాజీ కోప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాన్, మాజీ సర్పంచులు హాంజినాయక్, హేమ్లా నాయక్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు భూక్యా భాస్కర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
