24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మరో వివాదంలో  ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం నిజామాబాద్ కమిషనరేట్ కు వెళ్లారు.  , అక్కడ పోలీసులు జీవన్ రెడ్డికి ఒకేసారి రెండు  లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట గన్ లైసెన్స్ ఉండాలి, ఇందుకు విరుద్ధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఒక లైసెన్స్ సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో మరొకటి నిజామాబాద్ పరిధిలో ఉన్నట్లు తేలింది. దీంతో సీపీ సాయి చైతన్య వెంటనే జీవన్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేశారు. 2016 నుంచే ఆయన       రెండు లైసెన్సులు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం  సెక్యూరిటీని కూడా తొలగించడంతో  జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవ్యవహారంతో జీవన్ రెడ్డి  సోషల్ మీడియా వేదికగా సీపీపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు.  ఈ చర్య పోలీసు అధికారులు సంఘంలో కలకలం రేపింది.   విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై  పోలీసుల సంఘం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తప్పులన్నీ ఆయన చేసి పోలీసులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. పింక్ బుక్లో పేర్లు రాస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని సూచించింది.  మళ్లీ పోలీసులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారని పోలీసుల సంఘం వివరించింది.  జీవన్ రెడ్డి వర్సెస్ పోలీసుల మధ్య నెలకొన్న వివాదం  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article