29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమస్యల పరిస్కారానికి గ్రీవెల్స్ సెల్ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

టీఎన్ జీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్

భీమ్ గల్, బతుకమ్మ : వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సమస్యల పరిస్కారానికై డిస్ట్రిక్ట్ టీ ఎన్ జీ ఆఫీస్ వద్ద గ్రీవెల్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు డిస్ట్రిక్ట్ టీ ఎన్ జీస్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్ తెలిపారు. టీ ఎన్ జీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమ్ గల్ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంను చేపట్టారు. ముందుగా ఇటీవలే నూతనంగా ఎన్నికై భీమ్ గల్ కు మొట్ట మొదటిసారిగా వచ్చిన టీ ఎన్ జీ ఓ ప్రెసిడెంట్, సెక్రటరీలకు నింబచల లక్ష్మి నృసింహస్వామి దర్శనం చేయించి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేశారు. ఈ సందర్బంగా భీమ్ గల్ యూనిట్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్, సెక్రటరీ సుమన్, శేఖర్ లను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రెసిడెంట్ సుమన్ మాట్లాడుతూ సమస్యలున్న ఉద్యోగులు గ్రీవెల్ సెల్ ద్వారా వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలను విడితల వారిగా ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తున్నామని తెలిపారు.ఉద్యోగుల హక్కుల సాధనకై కృషి చేస్తున్నమన్నారు. ఈ సందర్బంగా విఆర్ ఐ ఉద్యోగులతో పాటుగా అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలపై భీమ్ గల్ యూనిట్ నాయకులతో చర్చించారు. టీ ఏన్ జీ ఓ సభ్యత్వ నమోదు రషీద్ లను ఆయన ఉద్యోగులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో భీమ్ గల్ టీ ఎన్ జీ ఓ అసోసియేట్ ప్రెసిడెంట్ చిట్టీ నారాయణ రెడ్డి, సెంట్రల్ సెక్రటరీ పోల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ సుంకరి దినేష్ బాబు, మెయిన్ అడ్వాయిజర్ వనమాల సుధాకర్, నాగరాజులు, వైస్ ప్రెసిడెంట్ కుంట శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు పురస్తు నరేష్, ఏడవెల్లి రవికుమార్, బాంపెల్లి సృజన్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article