25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అటవీ సంపద అన్యాక్రాంతం

Must read

📰 Generate e-Paper Clip

– బహిరంగంగా అమ్ముతున్న శాటిన్ వుడ్

– యథేచ్ఛగా వన్యప్రాణుల వేట

– ‘మాములు’గా తీసుకుంటున్న అటవీ అధికారులు

బతుకమ్మ, నవీపేట్ : ప్రకృతి సంపదను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. భావితరాలకు అందించాల్సిన అటవీసంపదను బహిరంగంగా మార్కెట్ లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా ఫారెస్ట్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీ సంపదను కాపాడల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అడవి లో పెరిగే చెట్లను ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా నరికివేయడం చట్ట విరుద్ధం. అడవిలో టేకు, సాటిన్ వుడ్ వంటి విలువైన వృక్ష సంపదన కాపాడాల్సిన అటవీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  అడవి లో పెరిగే సాటిన్ వుడ్ చెట్లను స్మగ్లర్లు నరికి వాటి మొద్దులను నవీపేట్ మేకల మార్కెట్ లో ప్రతి శనివారం అమ్ముతున్నా వారిపై చర్యలు కరువయ్యాయి. వీటితోపాటు అటవీ జంతువులను గుట్టుగా  చంపి మాంసానిన రహస్య ప్రదేశాల్లో అమ్ముతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఆదివారం నందిపేట్ మండలం శాపూర్ లో వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగించే వలలు, ఆయుధాలతోపాటు అడవి పందులను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారుల కళ్లుగప్పి వేటాడిన అడవి జంతువులను రహస్య ప్రదేశాల్లో అమ్ముతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  అటవీ చట్టాలను ఉల్లంఘింస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఫారెస్ట్ అధికారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం

– సురేందర్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి

అటవీ సంపదన కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాటిన్ వుడ్ అమ్ముతున్న ఘటనలపై విచారణ చేపట్టి బాధ్యులతోపాటు అధికారులపై చర్యలు తీసుకుంటాం.

More articles

Latest article