అటవీ సంపద అన్యాక్రాంతం
- బహిరంగంగా అమ్ముతున్న శాటిన్ వుడ్ - యథేచ్ఛగా వన్యప్రాణుల వేట - ‘మాములు’గా తీసుకుంటున్న అటవీ అధికారులు బతుకమ్మ, నవీపేట్ : ప్రకృతి సంపదను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. భావితరాలకు అందించాల్సిన అటవీసంపదను బహిరంగంగా మార్కెట్ లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా ఫారెస్ట్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీ సంపదను కాపాడల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అడవి లో పెరిగే చెట్లను ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా నరికివేయడం చట్ట విరుద్ధం. అడవిలో టేకు, సాటిన్...