25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఢిల్లీ మెప్పుకోసం… తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

Must read

📰 Generate e-Paper Clip

– తెలంగాణ తల్లి విగ్రహనికి క్షిరాభిషేకం చేసిన భారాస నాయకులు.

బతుకమ్మ,నవీపేట్:

ఢిల్లీ మెప్పుకోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవం ను తాకట్టుపెట్టి, రాజకీయ లబ్ది కొరకు ఆరాట పడుతున్నాడని నవీపేట బిఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్ లు ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు మంగళవారం నాడు నవీపేట్ మండల కేంద్రంలో గల తెలంగాణ తల్లికి క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, సచివాలయం వద్ద ఉండాల్సిన తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకం నర్సయ్య, పితంబర్, గైని సతీష్, మంత సాయిబాబా, పురం గోపి, శ్యామ్, శివకుమార్, బబ్లు,
బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు,

More articles

Latest article