. . . టోర్నమెంట్ ఫీజు కొరకు కొత్తపల్లి రవికిరణ్ 5 వేల రూపాయలు సహాయం
రుద్రూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్సి) ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సీపి సాయి చైతన్య ఎన్ఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో రుద్రూర్ గ్రామం నుండి ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. టోర్నమెంట్ లో ఎంట్రీ ఫీజు కొరకు రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ 5000 రూపాయల సహాయాన్ని శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఈటిలు షేక్ ఇంతియాజ్, ప్రకాష్, క్రికెట్ క్యాప్టెన్ జమీల్, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
