21న ఫుడ్ ఫెస్టివల్

0 19,681

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 21న శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మహిళ సంఘాల సభ్యులు, వీధి విక్రయదారులు, చిరు వ్యాపారాలు చేసేవారు ఈ కార్యక్రమoలో వారు తయారు చేసిన తిను బండారాల ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని అన్నారు.  నగర ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మెప్మా సభ్యులు, వీధి విక్రయదారులకు చేయూతను అందించాలని కమిషనర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.