బతుకమ్మ, ఏర్గట్ల : వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్గట్ల మండల కేంద్రం లో గుండం వద్ద నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాల వద్ద భక్తులు, యువజన సంఘాల సభ్యులు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్తులు వినాయకుడు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్ల పాపాలతో,సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని,పాడిపంటలు బాగుండాలని వినాయకుడిని వేడుకున్నారు.ఈ కార్యక్రమల్లో యువజన సంఘాలు,అన్నదాన దాతలు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
