26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాళేశ్వరం పై కాంగ్రెస్ విషం చిమ్మడం పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ జీవనాడి కాళేశ్వరం పై విషం చిమ్ముడాన్ని, కేసీఆర్ పై బురుదచల్లడాన్ని, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పజేప్పడాన్ని నిరసిస్తూ బాల్కొండ నియోజకవర్గం బీయర్ఎస్ శ్రేణులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు కీ. శే. వేముల సురేందర్ రెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన ఈ ధర్నాలో భాగంగా జాతీయ రహదారిని దిగ్బందణం చేశారు. రోడ్డు పై బైఠయించి సీ ఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. అర గంట పాటు ధర్నా నిర్వహించడం తో రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. దహనం చేయడానికి బీయర్ఎస్ నాయకులు తయారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ, సీ ఎం రేవంత్ రెడ్డి బొమ్మలను పోలీసులు లాకున్నారు.  అనంతరం పోలీసులు  ధర్నా చేస్తున్న బీయర్ ఎస్ నాయకులను రోడ్డు పై నుండి లాగేశారు. దాంతో బీయర్ ఎస్ శ్రేణులు పోలీసుల జూలుం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బీయర్ ఎస్ కానిస్టెన్సీ, మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ 22 నెలల పాలనలో చేసింది ఏమి లేదని, కేవలం ఫ్రీ బస్సు తప్ప అని అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను  హామీ విషయం నుండి మరిపించి కేసీఆర్ పై బురద చల్లడానికే నన్నారు. ఆదివారం ఒక్క రోజు అసెంబ్లీ పెట్టి సీ ఎం రేవంత్ రెడ్డి చేసిన ఘన కార్యాన్ని రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ సాక్షిగా చూశారని అన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ బదునాం చేస్తే ప్రజల్లో బదునం కాడాని, ఆయన వెంట ప్రజలన్నారని అన్నారు. కాంగ్రెస్ కు తోడు బీజేపీ నాయకులు తొడయ్యారని, అందరు ఒక్కటైనా కేసీఆర్ ను ఏమి చెయ్యలేరన్నారు. ఈ ధర్నాలో కానిస్టెన్సీ బీయర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు,డీసీసీబీ డైరెక్టర్లు,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటీసీలు, సొసైటీ చైర్మన్లు, మాజీ జడ్పిటీసీ, ఎం పీ పీలు, గ్రామాధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article