27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద

Must read

📰 Generate e-Paper Clip

 మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9 గంటల ప్రాంతంలో అది 89,466 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 80.5 టీఎంసీలకు గాను 51.659 పిఎంసిల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 5000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ కు 500 క్యూసెక్కులు, అలీ సాగర్ లిఫ్ట్ కు 108 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 6452 క్యూసెక్కుల అవుట్ ఫ్లో  కొనసాగుతోంది. మహారాష్ట్రలో, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గోదావరి ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. శనివారం వరద లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదరావడం అది లక్షపై చిలుకు రెండవసారి మాత్రమే.

More articles

Latest article