28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సింగూర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమ్మడి  మెదక్  జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదుగేట్లను శనివారం ఉదయం 9:30 గంటలకు అధికారులు ఓపెన్ చేశారు. ఎగువన మంజీర నదికి భారీగా వరద పొటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తత చర్యలు తీసుకున్నారు.  ఈ మేరకు 43, 176 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 24, 718 క్యూసెక్కుల భారీ వరద చేరుతుందని అధికారులు తెలిపారు.

జలదిగ్భంధంలో ఏడుపాయల దుర్గమ్మ  

మరోవైపు ఏడుపాయల ఆలయం వద్ద మంజీరకు వరద ఉధృతి పెరిగింది. ఏడుపాయల దుర్గమ్మ పాదాలను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం  దుర్గమ్మ ఆలయం మూసివేశారు.

అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు 

గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు  కామారెడ్డి జిల్లా శివారులోని పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శనివారం ప్రాజెక్టు నుంచి అలుగు పారింది.

More articles

Latest article