సింగూర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదుగేట్లను శనివారం ఉదయం 9:30 గంటలకు అధికారులు ఓపెన్ చేశారు. ఎగువన మంజీర నదికి భారీగా వరద పొటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 43, 176 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 24, 718 క్యూసెక్కుల భారీ వరద చేరుతుందని అధికారులు తెలిపారు. జలదిగ్భంధంలో ఏడుపాయల దుర్గమ్మ మరోవైపు ఏడుపాయల ఆలయం వద్ద మంజీరకు వరద ఉధృతి పెరిగింది. ఏడుపాయల...