బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తున్న ఈ సంస్థ విజయవంతంగా ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడంతో బాన్సువాడ కార్యాలయంలో కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు అందించిన శక్తివంతమైన ఆయుధం. ఈ చట్టం ద్వారా అవినీతి, అన్యాయం, పారదర్శకత లేని వ్యవహారాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ కాసిం, ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుదాం విఠల్, బాన్సువాడ నియోజకవర్గ కార్యదర్శి మోసిన్, జుక్కల్ నియోజకవర్గ కార్యదర్శి నాగభూషణం పాల్గొన్నారు.
