రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పున్న సావిత్రి, బడే లక్ష్మిలకు చెందిన ఇల్లులు ఇటీవలే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో కాలి పోవడం జరిగింది. వారి నిత్యవసర వస్తువులు, బట్టలు కాలి పోవడంతో వారికీ నష్టం వాటిల్లడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు ఆదివారం భాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మానవతా దృక్పధంతో 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు పటేల్, రుద్రూర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మహేష్, అంబం గ్రామ అధ్యక్షులు బట్టు నాగయ్య, కార్యదర్శి శానం గంగారాం, కుర్మా బాలయ్య, ఒడ్డె సాయిలు, దస్తగిరి, మూడ పోశెట్టి, రామసాని సాయిలు, శానం వేంకటి, నిజాం, అంజయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
