28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎట్టకేలకు ఆర్మూర్ డిఈ బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

  • వివాదాస్పద డిఈ హరిచంద్ కు స్థానచలనం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖలో వివాదాస్పదుడిగా పేరున్న విద్యుత్ శాఖాధికారి సి.హెచ్.హరిచంద్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఏడాది కాలంగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన హరిచంద్ ను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో జరిగిన డిఈల బదిలీల్లో స్థానచలనం కల్పించారు. ఆర్మూర్ డిఈగా పని చేస్తున్న హరిచంద్ పై ఎన్నో ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. ఈ విషయంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారి విచారణ జరిపిన చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే సోమవారం ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని పది మంది డిఈలకు బదిలీ చేశారు. అందులో భాగంగా ఆర్మూర్ లో డిఈ ఆపరేషన్ గా పని చేస్తున్న హరిచంద్ ను నిర్మల్ జిల్లా ఎంఆర్ టి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్ ఎంఆర్ టిలో పని చేస్తున్నరాజేశ్వర్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు.

More articles

Latest article