30.2 C
Hyderabad

మహిళా దొంగ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి  మండల కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఆదివారం అంగడికి వచ్చిన కాశవ్వ అనే మహిళకు మాయమాటలు చెప్పి బంగారు నగలు అపహరించింది. కాశవ్వ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తానే బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి నగలను రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ ఐ మహేష్ , కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.

More articles

Latest article