29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీ అవకాశం

Must read

📰 Generate e-Paper Clip

  • కాకతీయ ఐఐటి మెడికల్ అకాడమి చైర్పర్సన్ విజయలక్ష్మి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసిన మెరిట్ విద్యార్థులకు కాకతీయ ఐఐటి, మెడికల్ అకాడమి ఫీజు రాయితీ అవకాశాన్ని కల్పించిందని కాకతీయ ఐఐటి మెడికల్ అకాడమి చైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. ఎస్సెస్సీ పూర్తయిన మెరిట్ ఫిర్యాదులకు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విద్యాసంస్థ స్థాపించబడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫీజు రాయితీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెరిట్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ కోర్సుతో పాటు ఐఐటి మెడికల్ కోచింగ్ లో ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 12 వరకు అవకాశం ఉంటుందని ప్రతీ తరగతిలో ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని కావున పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మెరిట్ ప్రోత్సాహకాలు రెండు సంవత్సరాలకు వర్తిస్తుందని ఆమె తెలిపారు. 575కు పైగా మార్కులు వచ్చిన వారికి 100 శాతం ఫీజు రాయితీ, 565కు పైగా మార్కులు వచ్చిన వారికి 75 శాతం, 555కు పైగా మార్కులు వచ్చిన వారికి 60 శాతం, 545కు పైగా మార్కులు వచ్చిన వారికి 50 శాతం, 535కు పైగా మార్కులు వచ్చిన వారికి 45 శాతం, 525కు పైగా మార్కులు వచ్చిన వారికి 40 శాతం, 500లకు పైగా మార్కులు వచ్చిన వారికి 30 శాతం ఫీజు రాయితీ కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకునే డే-స్కాలర్ విద్యార్థులకు అడ్మిషన్ ప్రారంభమైనట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు 9182029525, 917756270 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు , తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

More articles

Latest article